ప్రపంచానికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.  అయితే పుహాన్ లో ఈ దిక్కుమాలిన వైరస్ మాంసం విక్రయదారుల నుంచి వచ్చిందని అందుకే అక్కడ లాక్ డౌన్ 75 రోజులు విధించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం పుహాన్ లో ప్రశాంత వాతావరణం నెలకొన్నా.. ప్రపంచ దేశాలకు మాత్రం గడ్డుకాలం వచ్చిపడింది.  తాజాగా కోవిడ్-19కు ప్రారంభ కేంద్రమైన వుహాన్‌లో కరోనా రోగుల కోసం నిర్మించిన అతిపెద్ద తాత్కాలిక ఆస్పత్రిని చైనా ప్రభుత్వం మూసివేసింది.

 

 గత నెల రోజలు క్రితం ఇక్కడ జనాలతో కిక్కిరిసిపోయింది.. చైనాలో క్రమేనా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో చైనా ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల సామర్థ్యంలో రెండు అతిపెద్ద ఆస్పత్రులను నిర్మించింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని తీసుకొచ్చి కొవిడ్-19 రోగులకు చికిత్స అందించింది. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో లైషెన్షన్ (లోతైన పర్వతం) పేరుతో నిర్మించిన ఓ తాత్కాలిక ఆస్పత్రిని మూసివేసినట్టు ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది.

 

వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లినట్టు తెలిపింది. కాగా, కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేసిన చైనా ప్రభుత్వం... జనవరి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు లాక్‌డౌన్ అమలు చేసింది. హుబై ప్రావిన్స్‌లో మొత్తం 67,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క వుహాన్‌లోనే 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా చైనాలో ఇప్పటి వరకు 3,342 మంది చనిపోయారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: