లాక్ డౌన్ కారణంగా సాధారణ ప్రజానీకానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది, మొదట ఏప్రిల్ 14 వరకు వున్నా లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం మే 3 వరకు పొడిగించిన విషయం తెసిందే. పొడిగించిన లాక్ డౌన్ కారణంగా సాధారణప్రజలు తీవ్ర అసహనం తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణ మంగళవారం ముంబైలో జరిగిన వలస కూలీలా సంఘటన. కావున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చింది. అంతరాష్ట్రాల పరిధిలో ఈ నియమాలు అమలు అవుతాయి .


గ్రామాలలో ప్రజలు తమ వ్యవసాయ వృత్తులు రవాణా చేసుకోవచ్చు. భావన నిర్మాణ కార్మికులకు సడలింపు ఇచ్చింది . అయితే లోకల్ లో ఉన్న వారిని మాత్రమే ఇందుకు తీసుకోవలసి ఉంటుంది. ఆక్వా ఉత్పత్తులు రవాణాచేసుకొనే వెసులుబాటు వుంది. అంతే కాకుండా చిన్న చిన్న పరిశ్రమలను రన్ చేసుకోవచ్చు. ఏదేని మరణం సంభవించినప్పుడు కార్యక్రమాలను జరుపుకొనేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి 20మంది కంటే ఎక్కవ హాజరవటానికి వీలులేదు . రెడ్ జోన్ లలో కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయి.  కొరియర్ సర్వీసులు మరియు e కామర్సు సంస్థలకు అనుమతి ఉంటుంది. కాఫీ మరియు తేయాకు పరిశ్రమలలో 50 శాతం కార్మికులకు అనుమతి. పంటల కొనుగోలుకు మండిలకు  అనుమతి. వరికోత యంత్రాలకు అనుమతి. వ్యవసాయ పనులకు పూర్తిగా అనుమతి. ఉపాధి హామీ పనులకు అనుమతి. అన్ని సరకుల రావణాలకు అనుమతి . రాష్ట్రాల మధ్య సరుకులు రవాణా చేసుకోవచ్చు . హాస్పిటల్స్ ,డిస్పెన్సరీ మరియు మెడికల్ షాప్స్ కి పూర్తియా అనుమతి , యధావిధిగా బ్యాంకులు అన్ని తెరిచే ఉంటాయి . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: