ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తంక‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న  32వేలమందిని గుర్తించాల‌మ‌ని, వారంద‌రికీ ద‌శ‌ల‌వారీగా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 11,613శాంపిల్స్‌ను సేక‌రించి, క‌రోనా నిర్ధార‌ణ  ప‌రీక్ష‌లు చేయ‌గా.. 11, 111 నెగెటివ్ కేసులు వ‌చ్చాయ‌ని, 502 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం  16 మంది క‌రోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపారు.  బుధ‌వారం క‌రోనా క‌ట్ట‌డి, తీసుకుంటున్న చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లు తీరుపై మంత్రుల బృందం స‌మావేశమైంది.

 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ఆయ‌న వివ‌రించారు. దేశంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా ఏపీలో ఇప్ప‌టికే మూడు సార్లు స‌ర్వేలే చేశామ‌ని తెలిపారు. ఇక‌ క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉన్న వారికి ఇబ్బంద‌లు క‌లుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. 14 రోజుల‌పాటు క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న వారికి మూడు వంద నుంచి రెండు వేల వ‌ర‌కు ఆర్థిక సాయం అందించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించార‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: