కాశ్మీర్ లో తూలీప్ గార్డెన్లకి ఓ ప్రత్యేకత ఉంది . ప్రతి సంవత్సరానికి ఈ గార్డెన్ ద్వారా 60 లక్షల ఆదాయం టూరిస్ట్ ల ద్వారా వస్తుందట. అయితే కరోనా కారణంగా కాశ్మీర్ వ్యాలీ మొత్తం నిర్మానుష్యంగా మారింది. తూలీప్ గార్డెన్ లో పూచే తూలీప్ పుష్పాలకి ప్రత్యేక గుర్తింపు ఉంది. లాక్ డౌన్ విధించిన నాటినుండి ఇప్పటివరకు తూలీప్ గార్డెన్ లో 13 లక్షల వరకు పూలు పర్యాటకుల కోసం ఎదురుచూస్తూవున్నాయట.

ఇది గత సంవత్సరం 2019 తో పోల్చుకుంటే చాల ఎక్కువట. ఇది వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి కనీసం చుట్టుపక్కల ఉన్న జనమే 4 లక్షలదాకా వచ్చేవారు. కనీసం ఆ జనం కూడా సందర్శించే వారు లేఖ పుష్పాలు దిగాలుగా ఉన్నాయ్. అయితే చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే అక్కడి వాతావరణం చాలావరకు స్వచ్చంగా మారిందని నిపుణులు తెలియజేస్తున్నారు. కరోనా కారణంగా ఇలాంటి మంచికూడా జరుగుతుండడమే విశేషం  

మరింత సమాచారం తెలుసుకోండి: