క‌రోనా వైర‌స్‌తో అగ్ర‌రాజ్యం అమెరికా చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. రోజుకు వంద‌లు, వేల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోతున్నారు. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే అమెరికాలో 2,600మంది మృతి చెందారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.  ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో మ‌ర‌ణాల సంఖ్య సుమారు 28,529 మంది మ‌ర‌ణించారు. సుమారు 49వేల మంది క‌రోనా బారి నుంచి కోలుకున్నారు. అయితే.. పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా న్యూయార్క్‌, న్యూజెర్సీ త‌దిత‌ర ప్రాంతాల్లో న‌మోదు అవుతున్నాయి.

 

నిజానికి.. న్యూయార్క్ క‌రోనా వైర‌స్‌కు కేంద్రంగా మారింద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక్క‌డే అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 25ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డ‌గా.. అందులో అమెరికాలోనే ఏకంగా 644055మందికిపైగా ఉన్నారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న దేశంగా అమెరికా నిలిచింది. పాజిట‌వ్ కేసుల సంఖ్య‌లో స్పెయిన్‌, ఇట‌లీ, ఫ్రాన్స్ దేశాల‌ను దాటిపోయింది. ఈ నేప‌థ్యంలో అమెరికాలో దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: