క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యాసంస్థ‌ల‌, కోచింగ్ సెంట‌ర్ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. విద్యార్థులు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే.. ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కోచింగ్ లేక‌పోవ‌డంతో ఎంసెట్‌పై బెంగ‌పెట్ట‌కుంటున్నారు. ఈ నేప‌థ్యంతో ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆకాశ‌వాణి(రేడియో) ద్వారా ఎంసెట్ శిక్ష‌ణ ఇస్తున్నట్లు మంత్రి విశ్వ‌రూప్ తెలిపారు. ప్ర‌తీరోజు ఉద‌యం 10.30గంట‌ల నుంచి 11గంట‌ల వ‌ర‌కు విద్యార్థులు రేడియోలో త‌ర‌గ‌తులు విన‌వ‌చ్చున‌ని తెలిపారు.

 

ఇక రేడియో అందుబాటులో లేని విద్యార్థులు స్మార్ట్ ఫోన్లో ఆలిండియా రేడియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోని, అందులో తెలుగు ఆప్ష‌న్‌ను ఎంచుకుని ఎంసెట్ క్లాసులు విన‌వ‌చ్చున‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుత లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. విద్యార్థులు స‌మ‌యం వృథా చేయ‌కుండా.. రేడియోలో ఎంసెట్ త‌ర‌గ‌తులను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ వార్త విని విద్యార్థులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: