మధ్యప్రదేశ్ లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రంలోని స్వచ్ఛ నగరంగా పేరొందిన ఇండోర్‌లో కరోనా వైరస్‌కు హాట్ స్పాట్‌గా మారింది. ఇండోర్ న గరంలో బుధవారం ఒక్కరోజే 159 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఒక్కరోజే 159 మం దికి కరోనా పాజిటివ్ వచ్చిందని చీఫ్ మెడికల్  అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా చెప్పారు. 

 

మొత్తం మీద ఒక్క ఇండోర్ జిల్లాలోనే మొత్తం క రోనా కేసుల సంఖ్య 597కు పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 11 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 987 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్క ఇండోర్ నగరంలోనే అత్యధికంగా కేసులు వె లుగుచూశాయి. దీంతో అధికారులు అప్ర‌మత్తం అయ్యారు. కేసులు ఎక్కువ‌గా న‌మోదైన ప్రాంతాల‌ను హాట్ స్పాట్‌గా గుర్తించి, ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీస‌కుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: