క‌రోనా వైర‌స్ బీభ‌త్సానికి పాజిటివ్ కేసుల సంఖ్య‌ నిద‌ర్శ‌నం.. అది సృష్టిస్తున్న విధ్వాంసానికి మ‌ర‌ణాల సంఖ్య‌ నిలువెత్తు సాక్ష్యం.. కొవిడ్‌-19 ఎంత‌వేగంగా ఈ ప్ర‌పంచాన్ని చుట్టేసిందో ఈ గ‌ణాంకాలను చూస్తే గుండె చెరువ‌వుతోంది. బుధ‌వారం నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20ల‌క్ష‌ల‌కు చేరుకుంది. నిజానికి.. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్ చూస్తుండగానే అన్నిదేశాల‌కు వ్యాపించింది. మొద‌టి 10ల‌క్ష‌ల కేసులు 93రోజుల్లో న‌మోదు కాగా.. కేవ‌లం 13రోజుల్లోనే మిగ‌తా 10ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

 

ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అంతుచిక్క‌ని వేగంతో ముట్ట‌డించింద‌ని అర్థం అవుతోంది. ఇందులో ప్ర‌ధానంగా యూర‌ప్ దేశాలు, అమెరికాలోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో ప్ర‌ధానంగా  యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలోని దేశాల్లో మొత్తం 78శాతం పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. 86శాతం మరణాలు సంభ‌వించాయి. నిజానికి.. చైనాలో ఈ వైర‌స్ పుట్టినా అమెరికా ఇప్పుడు ఇప్పుడు అతిపెద్ద హాట్ స్పాట్‌గా మారింది. కేవ‌లం 24 గంటల్లో 2,228 మరణాలను సంభ‌వించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 26,000 కు చేరుకుంది. ఇక ఇందులో సుమారు 10,000 మంది న్యూయార్క్‌లోనే మ‌ర‌ణించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: