ఇంగ్లిష్‌ మీడియం జీవోల రద్దుపై హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. బుధ వారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

 

హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయంగానో, అ పజయంగానో చూడొద్దన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ చెబుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు.  బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవడం, ఆంగ్ల మాద్యమంలో విద్యనభ్యసించడం టీడీపీకి ఇష్టం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.   ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన ఇంగ్లిష్‌ చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని నిలిపివేయడం వల్ల ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంద‌న్నారు. దీనిపై సుప్రీంకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేసి ఆంగ్ల మాధ్యమం కోసం న్యాయ పోరాటం చేస్తాం అని ఆయ‌న  పేర్కొన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: