ఢిల్లీలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా.. ఇద్ద‌రు కానిస్టేబుళ్లు క‌రోనా బారిన‌ప‌డ్డారు.  చాందిని మహల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లకు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికారులు వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారు క‌లిసిన‌ పోలీసు సిబ్బంది జాబితాను సిద్ధం చేస్తున్నారు. కాగా, చాందిని మహల్ ప్రాంతంలో ఇప్ప‌టివ‌ర‌కు  52 మందికిపైగా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పేషెంట్ల‌కు సేవలు అందిస్తున్న వైద్య‌సిబ్బందికి సోకిన క‌రోనా వైర‌స్ తాజాగా.. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కూడా వైర‌స్ సోకుతుండ‌డంతో అధికారవ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

 

మ‌రోవైపు ద‌క్షిణ ఢిల్లీలోని పిజ్జాబాయ్‌కి కూడా క‌రోనా సోక‌డంతో వెంట‌నే అధికారులు సుమారు 70మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇదిలా ఉంగా.. భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12, 380కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం 414 మంది మ‌ర‌ణించారు. ఇక‌ 10,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళ‌నాడు ఉన్నాయి. ఇందులో ముంబై న‌గ‌రం క‌రోనా వైర‌స్ కు హాట్‌స్పాట్‌గా మారింది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: