క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి క‌ట్ట‌డి చేయాలంటే ప్ర‌పంచ దేశాల్లోని ప్ర‌జ‌లు 2022 నాటి వ‌ర‌కు నిర్ణీత సామాజిక దూరాన్ని పాటించాల‌ని హార్వ‌ర్డ్ యూని వ‌ర్సిటీకి చెందిన హార్వ‌ర్డ్ టీ. హెచ్‌. స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ ప‌రిశోధ‌కులు తెలిపారు. అత్య‌వ‌స‌ర వైద్య స‌దుపాయాలు త‌గిన  స్థాయిలోకి వ‌చ్చే వ‌ర‌కూ, లేదా వైర‌స్‌ను నియంత్రించే వాక్సిన్ ను క‌నుగునే వర‌కూ సోష‌ల్ డిస్ట‌న్సే స‌రైన మార్గ‌మ‌ని వారు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ వివ‌రాలు జ‌న‌ర‌ల్ సైన్స్ లో ప్ర‌చురితం అయ్యాయి.

 

అమెరికాలో వైరస్ సంక్ర‌మ‌ణ జరిగిన విధానం, కేసుల స‌మాచారాన్ని సేక‌రించి ప‌రిశోధ‌కులు ఈ అధ్య‌య‌నాన్ని వెల్ల‌డించిన‌ట్లు తెలిపారు. అక్క‌డ‌క్క‌డ వెలుగు చూసిన వైర‌స్‌.. క్ర‌మంగా మ‌హ‌మ్మారిగా వ్యాపించి ప్ర‌పంచాన్ని చుట్టేసింద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచ వైద్య వ్య‌వ‌స్థ సామ‌ర్థాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లోకి రావాలంటే 2022 వ‌ర‌కు వేచి చూడాల‌న్నారు.

 

అయితే ఇది జ‌ర‌గాలంటే మాత్రం ప్ర‌జ‌లంతా నిర్ణీత దూరాన్ని పాటించాల‌ని అన్నారు. వైర‌స్‌ను న‌యం చేసే టీకాను అభివృద్ధి చేసి, ప‌రీక్ష‌లు జరిపి, అందుబాటులోకి తీసుకురావాలంటే సంవ‌త్స‌రాల కాలం ప‌ట్టొచ్చ‌ని అన్నారు. అప్ప‌టి వ‌రుకు నిర్ణీత దూరాన్ని పాటించ‌డ‌మే క‌రోనా క‌ట్ట‌డికి ఉత్త‌మ మార్గ‌మ‌ని వారు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: