దేశంలో ఏ ముహూర్తంలో కరోరా వచ్చిందో కానీ..  ప్రతిరోజూ  ఈ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వేలల్లో ఈ సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు.  తాజాగా అయిదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చిన సంఘటన జగిత్యాలలో వెలుగు చూసింది. జగిత్యాల మండలంలోని ఓ గ్రామంలో అయిదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆర్డీవో నరేందర్‌, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌రెడ్డి తెలిపారు.

 

ఇటీవలే గుంటూరులో ఆ బాలుడు ఆప‌రేష‌న్ చేయించుకుని ఈ నెల 14 సొంతూరికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఈ చిన్నారికి కరోనా లక్షణలు కనిపించగా.. పరిక్షలకు పంపారు. పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని తేల‌డంతో బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తాజా కేసుతో జగిత్యాల జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.

 

కరోనాను కట్టడి చేసేందుకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణాలో కాస్త కరోనా భయం తగ్గిందంటున్నా చిన్న పిల్లలకు ఈ కరోనా రావడం భయాన్ని కలిగిస్తుంది.  ఈ కరోనా మహమ్మారిని  తరిమి కొట్టేందుకు సర్వత్ర కృషి చేస్తున్నారు.  
 
 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: