దేశంలో కరోనా వైరస్ ని పూర్తిగా అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులు, మంత్రి వర్గంతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు చేయాల్సిన సహాయ సహకరాల గురించి చర్చిస్తున్నారు.  తాజాగా ‘కరోనా’ నివారణా చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష ముగిసింది. ‘కరోనా’ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని, తొలుత ‘కరోనా’ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. 

 

బయటకు వచ్చిన మరే ఇతర ప్రదేశాల్లో ఉన్నా గుంపులు గా ఉండొద్దని.. తప్పకుండా బౌతిక దూరం పాటించాలని అన్నారు.  క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని, క్వారంటైన్ పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున అందజేయాలని ఆదేశించారు. రేపటి నుంచి మాస్కుల పంపిణీ ప్రారంభిస్తామని, రెండు రోజుల తర్వాత మాస్కుల పంపిణీ విస్తృతం చేస్తామని జగన్ కు అధికారులు తెలిపారు.

 

లాక్ డౌన్ సమయంలో రైతులకు ఎలాంటి కష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.  రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను, మత్స్య కార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని, సరికొత్త పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: