అమెరికాలో క‌రోనా వైర‌స్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజుకు వంద‌లు, వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 9ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మ‌ర‌ణాల సంఖ్య ఏకంగా 29వేల‌కు చేరుకుంది. సుమారు 633,000 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు అమెరికాలో న‌మోదు అయ్యాయి. స్పెయిన్‌, ఇట‌లీ, ఫ్రాన్స్‌ల కంటే అమెరికాలోనే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

 

దీంతో అమెరికా ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గడ‌పుతున్నారు. నిన్న ఒక్క‌రోజే అంటే 24గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 26వేల మంది మ‌ర‌ణించారంటే.. అక్క‌డ ప‌రిస్థితి ఎంత దారుణంలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్ సిటీ క‌రోనా వైర‌స్‌కు హాట్‌స్పాట్‌కు కేంద్రంగా మారుతోంది. ఇక్క‌డే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. సుమారు ఒక్క న్యూయార్క్‌లోనే సుమారు 10వేల మందికిపైగా మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత న్యూజెర్సీలో కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: