దేశంలోనే ఇది మొద‌టి సారి.. ఢిల్లీలో క‌రోనా బాధితుల‌కు ప్లాస్మా చికిత్స అందించేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం స‌ర్వం సిద్ధం చేసింది. క‌రోనా పేషెంట్ల‌కు ప్లాస్మా చికిత్స అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి అర‌వింద్‌కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ప్లాస్మా థెర‌పీ ఆశాకిర‌ణ‌మ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. క‌రోనా బాధితులు త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి ఈ ప్ర‌క్రియ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇప్ప‌టికే నిపుణులు ప్ర‌క‌టించారు. ఈ చికిత్సను ప్రారంభిస్తున్న మొద‌టి రాష్ట్రంగా ఢిల్లీ నిల‌వ‌నుంది. అయితే.. క‌రోనా నుంచి కోలుకున్న వారి ర‌క్తం నుంచే ప్లాస్మాను సేక‌రించాల్సి ఉంటుంది. అయితే.. క‌రోనా నుంచి కోలుకున్న‌వారు ఎంత‌మేర‌కు ఇందుకు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్నేమ‌రి.  

 

కాగా,  దేశంలో ఈ రోజు 941 కొత్త క‌రోనా కేసులు బ‌య‌ట ప‌డ్డాయి. అదే క్ర‌మంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 414కు చేరుకున్నాయి.  ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం  పాజిటివ్ కేసుల సంఖ్య  మొత్తం 12,380 కు చేరుకుంది. ఇక‌ కరోనావైరస్‌ ప్రపంచవ్యాప్తంగా రెండు మిలియన్ల మందికిపైగా సోకింది. ప్ర‌చవ్యాప్తంగా 1,36,000 మందికి మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా 27 జిల్లాల్లో గ‌త 14 రోజులుగా ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు కూడా కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: