క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌కు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సెల్యూట్ చేశారు. హైద‌రాబాద్‌లో గురువారం రాత్రి 7గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న‌  లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను  అమ‌లు చేయ‌డానికి అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న పోలీసుల సేవ‌ల‌ను విజ‌య్‌దేవ‌ర‌కొండ కొనియాడారు. సీపీ అంజ‌నీకుమార్‌తో క‌లిసి పోలీస్ సిబ్బందికి ఆయ‌న ఫ్రూట్స్ జ్యూస్ అందించారు.

 

ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  ఇది కూడా యుద్ధ‌మేనని అన్నారు. పోలీసులు, వైద్య‌సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నార‌ని  అన్నారు. వీరంద‌రినీ మ‌నమంద‌రం గౌర‌వించాల‌ని అన్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎవ‌రూ కూడా ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌న్న ధ్యేయంతో పోలీసులు ప‌ని చేస్తున్నార‌ని అన్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని ఆయ‌న అన్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను మ‌నంద‌రం పాటించి, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: