* ప్రాణాల‌కు తెగించి ప‌నిచేస్తున్న‌ పోలీసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు నేను బ‌య‌ట‌కు వెళ్తాన‌ని మా అమ్మ‌కు చెప్పా..  అయితే..ఇప్పుడెందుకురా.. ఇప్పుడు బ‌య‌ట‌కు వెళ్ల‌డం అవ‌స‌ర‌మా..? ప‌రిస్థితులు బాగాలేవ‌ని అన్న‌ది. అయినా.. మా అమ్మ‌తో గొడ‌వ‌ప‌డి.. ఒప్పించి ఇక్క‌డికి మీకోసం వ‌చ్చా.. ఒక్క‌రోజు కుటుంబ స‌భ్యుల‌తో ఉండ‌క‌పోతేనే ఎంతో బాధ‌గా ఉంటుంది. కానీ మీరు మా కోసం.. స‌మాజం కోసం కుటుంబాల‌కు దూరంగా ఉంటున్నారు. లాక్‌డౌన్ అమ‌లు కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు* అని యంగ్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ పోలీసుల సేవ‌లను కొనియాడారు. క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌కు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సెల్యూట్ చేశారు.

 

హైద‌రాబాద్‌లో గురువారం రాత్రి 7గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న‌  లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను  అమ‌లు చేయ‌డానికి అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న పోలీసుల సేవ‌ల‌ను విజ‌య్‌దేవ‌ర‌కొండ కొనియాడారు. సీపీ అంజ‌నీకుమార్‌తో క‌లిసి పోలీస్ సిబ్బందికి ఆయ‌న ఫ్రూట్స్ జ్యూస్ అందించారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తీ ఒక్క‌రు ఇళ్ల‌లోనే ఉండాల‌ని, బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. మ‌న కోసం, మ‌న స‌మాజం కోసం ఇళ్ల‌లోనే ఉండాల‌ని కోరారు. పోలీసులు, వైద్య సిబ్బందికి మ‌నంద‌రం స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. వెంట‌నే స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: