ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విధ్వంసం కొన‌సాగుతోంది. రోజురోజుకూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. రోజూ వేల సంఖ్య‌లో ప్రాణాలు పోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 21,66 లక్షలకుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1,44,515 మంది మృతి చెందారు. ఇక అమెరికాలో అయితే మ‌ర‌ణ మృదంగ‌మే. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో 6,69,378 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యా. ఇక 34.103 మంది మృతి చెందారు.

 

అమెరికా ఇప్పుడు కొవిడ్‌-19కు హాట్‌స్పాట్‌గా మారింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు యూఎస్‌లోనే న‌మోదు అవుతున్నాయి. అక్క‌డి ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ పూట‌గ‌డుపుతున్నారు. ఇక్క‌డ కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే రెండువేల మందికిపైగా మ‌ర‌ణిస్తున్నారంటే..ప‌రిస్థితి ఎంత దారుణంగా.. మ‌రెంత ద‌య‌నీయంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇట‌లీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇరాన్ త‌దిత‌ర దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఇక మ‌రొక విష‌యం ఏమిటంటే.. మొత్తం మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల్లో యూర‌ప్‌, అమెరికాలోనే 50శాతానికిపైగ న‌మోదు అవుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: