అమ్మ ప్రేమ అనిర్వ‌చ‌నీయం.. పిల్ల‌లకు చిన్న ఇబ్బంది ఏర్ప‌డినా త‌ల్లి త‌ల్ల‌డిల్లిసోతుంది.. క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌న గుండెల్ని నిమిరే ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అస‌లే..క‌రోనా మ‌హ‌మ్మారి.. ప్ర‌పంచాన్ని చుట్టేసింది.. దాని క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌. అడుగడుగునా నిఘా.. అడుగుతీసి అడుగువేయ‌లేని నిర్బంధం.. అయినా.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కొడుకు కోసం ఆ త‌ల్లి పెద్ద సాహ‌స‌మే చేసింది. మూడు రోజులు.. ఆరు రాష్ట్రాలు దాటుకుని.. 2, 700 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిచి కొడుకు వ‌ద్దకు చేరుకుంది. కేర‌ళ‌కు చెందిన షీలామావాసన్(50) కుమారుడు అరుణ్‌కుమార్‌(29) రాజ‌స్తాన్‌లోని జోద్‌పూర్‌లో జ‌వాన్‌.

 

అక్క‌డ కండ‌రాల నొప్పితో బాధ‌ప‌డుతూ ఎయిమ్స్‌లో ఆస్ప‌త్రిలో చేరారు. త‌న త‌ల్లిని, కొడుకును చూడాల‌ని వైద్యుల‌కు చెప్ప‌డంతో వారు స‌మాచారం అందించారు. ఈ విష‌యం తెలియ‌గానే.. త‌ల్లి షీలామా వాస‌న్ త‌ల్ల‌డిల్లిపోయింది. ఎలాగైనా అక్క‌డికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. వీహెచ్‌పీ సంస్థ హిందూ హెల్ప్‌లైన్ వలంటీర్లు ఒక క్యాబ్, ఇద్దరు టాక్సీ డ్రైవర్లను జోధ్‌పూర్‌కు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశారు. క్యాబ్‌లో ఆమెతోపాటు అల్లుడు, మ‌రొక బంధువు బ‌య‌లుదేరారు. కేరళ నుండి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా జోద్‌పూర్‌కు చేరుకున్నారు. మూడు రోజులపాటు ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. దేవుడి ద‌య‌వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్ప‌డ‌లేద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: