క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లు అయిన చైనా.. దానికి విరుగుడు అంటే..వ్యాక్సిన్ క‌నిపెట్టే ప‌నిలోనూ ముందంజ‌లోనే ఉంది. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన కొవిడ్‌-19ను క‌ట్ట‌డి చేసిన చైనా.. ఇప్పుడు వ్యాక్సిన్ క‌నిపెట్ట‌డంలో స‌త్ఫ‌లితాలు సాధిస్తోంది. ఇప్ప‌టికే వ్యాక్సిన్ మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌ను విజ‌యంవంతంగా పూర్తి చేసిన చైనా.. తాజాగా రెండో ద‌శ ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభిస్త‌న్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో 108మందిపై వ్యాక్సిన్‌ను ప్ర‌యోగించింది. అయితే.. వారంద‌రూ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు పేర్కొంది. ఇక రెండో ద‌శ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను ఏకంగా 500మందిపై ప్ర‌యోగిస్తున్నారు. ఇదే అత్యంత కీల‌క‌మ‌ని చైనా చెబుతోంది.

 

క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి ఈ వ్యాక్సిన్ ఎంత‌వ‌ర‌కు కాపాడుతుందో తెలుసుకోవ‌డానికి చైనా మిలిట‌రీలోని వైరాల‌జిస్ట్ చెన్ వీ నెతృత్వంలోని ప‌రిశోధ‌నా బృందం గ‌త ఆదివారం రంగంలోకి దిగింది. ఇక్క‌డ మరొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో యువ‌తే పాల్గొన్నారు. కానీ.. రెండోద‌శ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను వృద్ధుల‌పైనా ప్ర‌యోగిస్తుంది. ఈ మేర‌కు ఏకంగా 84ఏళ్ల వృద్ధురాలిపై కూడా వ్యాక్సిన్ ప్ర‌యోగిస్తున్న బుధ‌వారం ఒక వీడియోలో చూపించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు అగ్ర‌రాజ్యం అమెరికా కూడా వ్యాక్సిన్ క‌నిపెట్టే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఈ నేప‌థ్యంలో ముందుగా ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి మ‌రి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: