ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తిలో కొత్త‌గా 5 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో శ్రీకాళ‌హ‌స్తిలో మొత్తం కేసుల సంఖ్య 10 కి చేరింది. వీరిలో ఒక మ‌హిళ‌కు కూడా క‌రోనా బారిన ప‌డింది. దీంతో రాష్ట్రంలో  ప్రస్తు తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరింది.

 

బుధ‌వారం రాత్రి 7 గంట‌ల నుంచి గురువారం ఉదయం తొమ్మిది గంట‌ల‌కు కొత్త‌గా 9 కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో కృష్ణా, క‌ర్నూలు, పశ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొత్త‌గా మూడేసి కేసులు న‌మోద‌య్యాయి. 20 మంది ద‌వాఖాన‌ల్లో చికిత్స పొంది వ్యాధి న‌య‌మై ఇళ్ల‌కు చేరుకున్నారు. ఇంకా 500 మంది ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నార‌ని వైద్య ఆరోగ్య‌శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకి మ‌ర‌ణించిన వారి సంఖ్య 14కు చేరింది. కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 20 కి చేరింది. అలాగే గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 122కు చేర‌గా, క‌ర్నూల్ జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 58, కృష్ణా జిల్లాలో 48కు చేరాయి. ప్ర‌స్తుతం మొత్తం 500 మంది క‌రోనా బారిన ప‌డి ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: