దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజకీ ప్రబలి పోతున్న విషయం తెలిసిందే.  అయితే ఏపిలో కరోనా కట్టడి చేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తగు రీతిలో స్పందిస్తూ.. ఉన్నతాధికారులు, మంత్రి వర్గంతో సమీక్ష సమీవేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల పరిస్థితులు, కరోనా పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. నేటి నుంచి ఏపీలో మాస్క్‌ల పంపిణీ 5.34 కోట్ల మందికి 16 కోట్ల మాస్క్‌లు పంపిణీ ఒక్కొక్కరికి 3 మాస్క్‌ల చొప్పున పంపిణీ చేయనున్న ఏపీ సర్కార్ స్వయం సహాయక సంఘాలకు మాస్క్‌ల తయారీ అప్పగింత హాట్‌స్పాట్‌ ఏరియాలో తొలి విడత మాస్క్‌ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

 

‘కరోనా’ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని, తొలుత ‘కరోనా’ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు.

 

రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను, మత్స్య కార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్ ఆదేశించారు.ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని, సరికొత్త పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: