ఏపిలో కరోనా వైరస్ చాపకీంత నీరులా ప్రబలిపోతుంది.  గుంటూరు, కర్నూల్ తర్వాత విజయవాడ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విజయవాడలోనే 40కి పైగా కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వస్తున్న కేసులు అన్నీ నగరంలోనే నమోదు అవుతున్నాయి. కాగా దాదాపు 7 మందికి ఎవరి ద్వారా వైరస్ సోకిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన వారి సంఖ్య  3,374 కాగా...ఇంకా 1,788  మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

 

1,538 నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కరోనా ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ ముజాహిద్దీన్ మర్కజ్ యాత్రలకు వెళ్లి వచ్చిన వారికి ఈ కరోనా ఎక్కువగా ఉందని.. అందువల్లే కొన్ని కేసులు పెరిగిపోయాయని అంటున్నారు.  గురువారం నాటికి  మొత్తం కేసుల సంఖ్య 48 కి చేరగా.. ఇందులో 40 కేసులు విజయవాడకు చెందినవారివే.. ఇందులో నలుగురు ఇప్టపికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో నలుగురిని వైరస్ బలితీసుకుంది.  

 

అయితే విజవాడ సింగ్ నగర్ ప్రాంతంలోని శాతి నగర్ చెందిని ఓ వాలంటీర్ (22) కు కరోనా సోకిందని నిర్ధారించారు.  ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటీవ్ నమోదు కాగా.. అతని ద్వారా ఇతనికి కరోనా సోకగా, అధికారులు అప్రమత్తంఅయ్యారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: