1930 త‌ర్వాత దేశంలో ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎన్న‌డూ చూడ‌లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌న్ శ‌శికాంత్ దాస్ అన్నారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను క‌రోనా వైర‌స్ కో లుకోలేని దెబ్బ‌తీసింద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెల‌కొంద‌ని పేర్కొన్నారు. క‌రోనా విప‌త్తు త‌ర్వాత దేశ ఆర్థిక వృద్ధి రేటు శ‌ర‌వేగంగా పె రుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  బ్యాంకులు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను సాధారణ స్థితికి తెచ్చేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నామ‌ని  అన్నారు. వైర స్ తీవ్ర‌త‌లోనూ విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులంద‌రికీ ఈసంద‌ర్భంగా ఆయ‌న ధ‌న్య‌వాధాలు  తెలిపారు. 

 

శుక్ర‌వారం ఉదయం ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌శికాంత్ దాస్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు, ఆర్బీఐ తీసుకుంటున్న చ ర్య‌ల‌ను వివ‌రించారు. ఆర్థిక రంగం బ‌లోపేతానికి ఆర్బీఐ కొత్త చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌క‌టించారు. దేశంలో ఆహార కొర‌త లేద‌ని, దేశ ఆర్థిక ప రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని అన్నారు. నాలుగు నెల‌ల క‌నిష్టానికి పారిశ్రామిక వృద్ధిరేటు దిగ‌జారింద‌న్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో జీడీపీ వృద్ధిరేటు 1.9 ప‌రిమితం కానుంద‌ని అన్నారు. ఎటువంటి ప‌రిస్థితులైనా ఎదుర్కొని, అనుకున్న వృద్ధిరేటు సాధిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: