క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అంతా కుప్ప‌కూలింది. ప్ర‌పంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు మంచి స్వింగ్‌మీద ఉన్న వేళ అనుకోని ఉప‌ద్ర‌వంలా వ‌చ్చిన క‌రోనా దెబ్బ‌కు మ‌హామ‌హా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లే కుప్ప‌కూలిపోయాయి. ఇక మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా ఎలా కుప్ప‌కూలిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీనిని గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. శుక్ర‌వారం ఉద‌యం ఆర్బీఐ గ‌వర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ముంబైలోని ఆర్బీఐ  కార్యాల‌యంలో ఆర్బీఐ తీసుకున్న ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.

 

ఇక ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు 9 ట్రిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం వాటిల్లింద‌న్న విష‌యం కూడా ఆయ‌న చెప్పారు. భార‌త జీడీపీ 1.9గా ఉంటుంద‌ని ఐఎంఎప్ అంచ‌నా వేసింది. ఇదే క్ర‌మంలో జీడీపీలో 3.2 శాతం న‌గ‌దును అందుబాటులోకి తెచ్చిన‌ట్టు కూడా చెప్పారు. 2021-22 నాటికి యేడాదికి వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుంద‌ని చెప్పారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా జీ 20 దేశాల వృద్ధి రేట్లు ప‌డిపోయినా మ‌న‌దేశ వృద్ధి రేటు మాత్రం అధికంగానే ఉంద‌ని.. లాక్‌డౌన్ త‌ర్వాత మొత్తం 1.20 లక్ష‌ల కోట్లు విడుద‌ల చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: