ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా భారీన ప‌డ‌ని దేశం అంటూ లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఐదారు దేశాలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా భారీన ప‌డ‌లేదు. అందులో మ‌కావు, ఉత్త‌ర కొరియా, తుర్క్‌మెనిస్తాన్‌, క‌జ‌కిస్తాన్, లెసెతో దేశాలు మాత్ర‌మే క‌రోనా భారీన ప‌డ‌లేదు. ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 వేల మంది క‌రోనా భారీన ప‌డ్డారు. ఇక 448 మంది చ‌నిపోయారు. అస‌లు క‌రోనా ఎప్పుడు త‌గ్గుతుందో ?  ఎప్పుడు పూర్తిగా అంత‌మవుతుందో ?  తెలియ‌ని ప‌రిస్థితి. 

 

మ‌న‌దేశంలో అన్నిరాష్ట్రాల్లోనూ క‌రోనా భ‌యం వెంటాడుతోంది. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో మ‌న‌దేశ సైన్యంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఆర్మీ అంటే ఎంత క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా మ‌న సైన్యంలో 
ఇప్పటివరకు 8 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

ఈ ఎనిమిది మందిలో ఇద్ద‌రు వైద్యులు, ఒక‌రు న‌ర్సింగ్ అసిస్టెంట్ ఉన్నార‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదే టైంలో క‌రోనా సోకిన న‌లుగురు జ‌వాన్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇక ల‌డ‌క్ సెక్టార్‌లో క‌రోనా సోకిన ఓ జ‌వాన్ పూర్తిగా కోలుకున్నార‌ని కూడా వారు తెలిపారు. ఆ జ‌వాన్ కోలుకుని విధుల్లో చేర‌డం కూడా జ‌రిగింద‌ని కూడా ఆర్మీ అధికారులు చెప్పారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: