తెలంగాణ‌లో క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తి రేష‌న్ కార్డు ఉన్న కుటుంబానికి ప్ర‌భుత్వం ఇస్తోన్న రు.1500 న‌గ‌దు ఓ మ‌హిళ ప్రాణం తీసింది. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ‌ల కేంద్రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌భుత్వం ఇస్తోన్న రు. 1500 న‌గ‌దు తీసుకునేందుకు ఆమె గంట‌ల కొద్ది క్యూలో నిలుచోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆమె సొమ్ముసిల్లి ప‌డిపోయింది.

 

ఆమె ప‌డిపోయిన విష‌యం గుర్తించిన ప‌క్క‌నే ఉన్న వారు 108కు ఫోన్ చేయ‌గా.. ఆమెను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లిస్తుండ‌గానే మార్గంలోనే ప‌ల్స్ రేటు ప‌డిపోయి మృతి చెందింది. మృతురాలు కానాపూర్ తండాకు చెందిన నానోత్ క‌మ‌ల (45) గా గుర్తించారు. ఏదేమైనా బ్యాంకులు ఎండ‌ల తీవ్రత నేప‌థ్యంలో స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని.. అందుకే ప్ర‌జ‌లు ప‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని.. చివ‌ర‌కు ఇలా ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయ‌ని ప‌లువురు వాపోతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: