కొవిడ్‌-19 మ‌హారాష్ట్ర‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. క‌రోనా వైర‌స్ దాటికి ఇప్ప‌టికే 194 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌డిచిన 24 గంట‌ల్లోనే ఏడుగురు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3, 204కు చేరింది.  కొవిడ్ కట్టడికి పటిష్ట చ ర్యలు కొనసాగుతున్నా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

 

పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.  రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగు తున్నందున మహారాష్ట్రలో అధికారులు పూల్ టెస్టింగ్‌కు సిద్ధమవుతున్నారు. కరోనా మరణాలకు సంబంధించి మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ నిలిచింది. 53 మంది కొవిడ్‌తో మరణించారు. గుజరాత్‌లో 36 మంది కరోనాతో చనిపోతే, ఢిల్లీలో 32 కొవిడ్ మ రణాలు సంభవించాయి. కర్నాటక, పంజాబ్, యూపీలలో 13 మంది చొప్పున కరోనాకు బలయ్యారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: