కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది  పడుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజి లోని ఓ కంప్యూటర్ ఆపరేటర్ కి కరోనా పాజిటివ్ వచ్చిన సంఘటన ఈరోజు వెలుగుచూసింది. అయితే ఒక్కసారిగా హాస్పిటల్ వాతావరణం భయానకంగా మారింది . గాంధీలో పనిచేసే వారంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. అయితే సదరు ఆపరేటర్ ని పలువురు ప్రొఫెసర్లు కలసినట్లు సమాచారం. ఈ కంప్యూటర్ ఆపరేటర్ ను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అంతా కూడా కలసినట్లు సమాచారం.

 

 

వీరంతా కూడా ఆ వ్యక్తికీ కరోనా పాజిటివ్ రావడంతో బెంబేలెత్తి పోయి వారాంతకుడా రక్త నమూనాలను పరీక్షలకు పంపినట్లు సమాచారం.కరోనా బారిన పడిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడని మాత్రమే అధికారులు వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి కూడా శాంపిళ్లను సేకరించినట్లు సమాచారం. ఆయన ఎవరెవర్ని కలిశాడనే దిశగా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.  ఇప్పటివరకు తెలంగాణ మొత్తం మీద 700 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . 186 మంది రికవరీ అయ్యారు . 18 చనిపోగా 496  కేసులు ఆక్టివ్ కేసులు గా ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: