క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాలు కుదేల‌వుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా న‌మోదు అవుతున్న క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల‌తో మ‌న‌దేశాన్ని, అందులోనూ మ‌హారాష్ట్ర‌తో పోల్చితే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌వుతున్నాయి. మ‌హారాష్ట్ర‌లో న‌మోదు అవుతున్న క‌రోనా మ‌ర‌ణాల రేట్ జాతీయ మ‌ర‌ణాల స‌గ‌టు కంటే రెట్టింపుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. అంత‌ర్జాతీయంగా న‌మోదు అవుతున్న మ‌ర‌ణాల రేట్ క‌న్నా కొంచెం త‌క్కువ‌గా ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1991562 పాజిటివ్ కేసులు న‌మోదు అయితే.. ఇందులో కొత్త కేసులు 76,647 ఉన్నాయి. ఇక మ‌ర‌ణాల సంఖ్య 130, 885. ఇందులో కొత‌గా న‌మోదు అయిన మ‌ర‌ణాల సంఖ్య 7875. మొత్తంగా ప్ర‌పంచ వ్యాప్తంగా  మ‌ర‌ణాల స‌గ‌టు రేట్ 6.57శాతంగా ఉంది. ఇక భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 13, 386 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో కొత్త‌గాన‌మోదు అయిన కేసులు 1006. మొత్తం దేశ‌వ్యాప్తంగా మ‌ర‌ణాల సంఖ్య 437. ఇందులో కొత్త‌గా న‌మోదు అయిన మ‌ర‌ణాల సంఖ్య 23. ఇక జాతీయ మ‌ర‌ణాల స‌గ‌టు రేట్ 3.26శాతంగా ఉంది.

 

మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం పాజిటివ్ కేస‌ల సంఖ్య 3,204. ఇందులో కొత్త‌గా న‌మోదు అయిన కేసుల సంఖ్య 288. మొత్తం మ‌ర‌ణాలు 194. కొత్త‌గా న‌మోదు అయిన మ‌ర‌ణాల సంఖ్య 7. మ‌ర‌ణాల స‌గ‌టు రేట్ 6.05శాతంగా న‌మోదు అయింది.  అంటే.. జాతీయ మ‌ర‌ణాల సగ‌టు రేట్ క‌న్నా మ‌హారాష్ట్ర‌లో న‌మోదు అవుతున్న మ‌ర‌ణాల రేట్ రెట్టింపుగా ఉంది. ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే అంశ‌మైని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. మ‌హారాష్ట్ర త‌ర్వాత ఢిల్లీ, త‌మిళ‌నాడు, రాజ‌స్తాన్‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఎక్కువ‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పొడిగించిన విష‌యం తెలిసిందే.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: