కరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభ సమయంలో మరో ఆసక్తికరమైన ఫీచర్ ను యూజ‌ర్ల ముందుకు తీసుకొచ్చింది వాట్స‌ప్‌...  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంతమైన వాట్సాప్ కొత్త అప్ డేట్ లను తీసుకొస్తోంది. ఎప్పటికపుడు కొత్త ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సాప్ మరో ఇంట‌రెస్టింగ్ ఫీచర్ ను జోడించనుంది.

 

 వా బేటా ఇన్ఫో అందించిన సమాచారం ప్రకారం వీడియో, ఆడియో కాలింగ్ లో పాల్గొనే  యూజర్ల పరిమితిని పెంచడానికి  వాట్సాప్ సన్నాహాలు చే స్తోంది.  గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్‌ కు ఆదరణ భారీగా పెరిగిన నేపథ్యంలో  ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేలా  ప్రయత్నాలు ముమ్మరం చే సింది. డార్క్ మోడ్, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌లాంటి ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా గ్రూప్ వీడియో, ఆడియో కాలింగ్  పరిమితిని పెంచేందుకు యోచిస్తోంది. తద్వారా టెక్ దిగ్గజం గూగుల్ వీడియో కాలింగ్ యాప్ డియో, చైనాకు చెందిన జూమ్ లాంటి యాప్స్ దూకుడుకు కళ్లెం వేయాలని భా విస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: