దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో మహిళలపై గృహ హింస కేసులు పెరిగిపోతున్న‌ట్లు  జాతీయ మహిళా కమిషన్‌ గణాంకాలు వెల్లడి స్తున్నా యి. ఈ నేపథ్యంలో భర్తల చేతిలో వేధింపులకు గురయ్యే భార్యలకు ఊరట కల్పించేలా మహారాష్ట్రలోని పుణే అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు.   మహిళలు లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే ఉన్నందున వారిని భర్తలు ఎవరైనా వేధిస్తే నిందితులను క్వారంటైన్‌కు పంపాల‌ని పూణే జిల్లా పరిషత్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 

తొలుత కౌన్సెలర్లు, పోలీసుల సాయంతో నచ్చచెపుతామని, అయినా భర్తల ప్రవర్తనలో మార్పు రాకుంటే క్వారంటైన్‌కు తరలిస్తామని వారు స్పష్టం చేశా రు. దీని కోసం తాము పంచాయ‌తీ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలను వ‌లంటీర్లుగా నియమించి ఇంటింటికీ వెళ్లి వాకబు చేయిస్తామని చెప్పారు. వే ధింపుల వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు లాక్‌డౌన్‌ సమయంలో బయటకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వారి ఇంటి వద్దే శానిటరీ నాప్కిన్స్‌, మందులు సరఫరా చేస్తామని వెల్ల‌డించారు. లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ భర్తల చేతిలో గృహహింసకు గురవుతున్నారనే వార్తలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అక్క‌డి అధికారులు వెల్లడించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: