క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై, పాటించాల్సిన సామాజిక దూరంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ముంబై పోలీసులు వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా పోస్ట‌ర్ల‌ను రూపొందించారు. వీటికో ప్ర‌త్యేకత కూడా ఉండి. దూర‌ద‌ర్శ‌న్‌లో చాలా ఏళ్ల‌క్రితం ప్ర‌సార‌మైన సీరియ‌ళ్ల పేర్ల‌ను ఉప‌యోగించి, ప్ర‌జ‌ల్లోకి వినూత్నంగా వెళ్తున్నారు. *దేఖ్ భాయ్ దేఖ్.. బ‌య‌ట‌ మహాభారతం జరుగుతోంది. ఎవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా.. దానిని ఫ్లాప్ షోగా మార్చండి* అంటూ పోస్ట‌ర్ల‌ను రూపొందించి ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. మ‌రికొన్ని సీరియ‌ళ్లు, సినిమాల పేర్ల‌ను ఉప‌యోగించి, పోస్ట‌ర్ల‌ను రూపొందించారు.

 

షారూఖ్ ఖాన్ న‌టించిన చిత్రం *సర్కస్*,  *ఫౌజీ* తో సహా ప‌లు ప్రదర్శనల శీర్షికలను ఉప‌యోగిస్తూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. * శ్రీమాన్, శ్రీమతి.. దయచేసి కరంచంద్ గా మారకండి లేదా *బ్యోమకేష్. * కరోనావైరస్ *ఫౌజీ *తో పోరాడుతోంది. సర్కస్ చేయడానికి ఇంటి నుంచి  అడుగు పెట్టవద్దు* అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ఇలా పాత సీరియ‌ళ్లు, సినిమాల టైటిళ్ల‌కు హాస్య‌భ‌రితంగా కాస్త సృజ‌నాత్మ‌కత‌ను జోడించి పోస్ట‌ర్లు రూపొందిం ప్ర‌చారం చేయ‌డంతో ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంద‌ని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: