* కేటీఆర్ సర్‌.. మా అమ్మ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతోంది. ప‌రిస్థితి చాలా విష‌మంగా ఉంది. అమ్మ చివ‌రిద‌శ‌లో ఉంది. మాది ఏపీలోని విజ‌య‌న‌గ‌రం. లాక్‌డౌన్ వ‌ల్ల మేము హైద‌రాబాద్‌లోనే ఇరుక్కుపోయాం. మేము ఇక్క‌డి నుంచి విజ‌య‌న‌గ‌రం వెళ్ల‌డానికి ఎలాంటి అవ‌కాశమూ లేదు. మేం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇది చాలా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి. కాబ‌ట్టి మాకు ఎన్‌వోసీ ఇప్పించండి ప్లీజ్‌. మా అమ్మ హెల్త్ స‌ర్టిఫికెట్లు చూడండి స‌ర్ * అంటూ సివ్వం లావ‌ణ్య తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

 

అయితే.. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ వెంట‌నే స్పందించారు. త‌మ సిబ్బంది సాయం చేస్తార‌ని పేర్కొన్నారు. ఇలా నిత్యం అనేక మంది ఆప‌ద‌లో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తున్నారు. అంతేవేగంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తున్నారు. వారికి సాధ్య‌మైనంత తొంద‌ర‌గా సాయం అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఎక్క‌డివాళ్లు అక్క‌డే చిక్కుకుపోయారు. దీంతో అత్యవ‌స‌రం ఉన్న‌వాళ్లు.. ఆప‌ద స‌మ‌యంలో ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వారు.. పోలీసుల అనుమ‌తి తీసుకుని వెళ్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: