కరోనా కారణంగా సూర్య పేటలో రెడ్ జోన్ ప్రకటించే అవకాశం ఉంది, ఎందుకంటె జిల్లాలో ఏప్రిల్ 2 వ తారీఖున ఒక పాజిటివ్ కేసునమోదు అయ్యింది అయితే 15 రోజులుకూడా కాకుండానే శనివారం రోజు ఉదయానికి 5 కేసులు పాజిటివ్ గా వచ్చాయి . మరల ఇప్పటివరకు కొత్తగా పది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి .మొత్తం గా ఇవాల్టివరకు 15 పాజిటివ్ కేసులు గా నమోదు అయ్యాయి . గడిచిన 24 గంటల్లో నమోదైన 15 కేసులు కలుపుకుని మొత్తం 54 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యాయి.

 

అదేవిధంగా సూర్యాపేట కూరగాయల మార్కెట్‌ ఏరియాలో 7 పాజిటివ్ కేసులు, బీబీ గూడెంలో 2, కోదాడలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు కలెక్టర్ ప్రకటించారు. గురువారం నాడు జిల్లావ్యాప్తంగా 16 కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలియజేసిన సంగతి తెలిసినదే. అయితే సూర్యాపేట మార్కెట్ ప్రాంతాన్ని అంతకుడా అష్టదిగ్బంధం చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి తెలియచేస్తున్నారు . అందుకు తగు నివారణ చర్యలు చేపడుతున్నట్లు అయన తెలియ జేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: