అమెరికా రైతులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి వారిని కాపాడేందుకు భారీ మొత్తంగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. 19 బిలియ‌న్ డాల‌ర్ల సాయాన్ని శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతుల సేవ‌ల‌ను కొనియాడారు. * మీరు గొప్ప వ్య‌క్తులు.. గొప్ప అమెరిక‌న్లు.. ఎన్న‌డూ ఫిర్యాదు చేయ‌రు.. మీ ప‌ని మీరు చేస్తూ ఉంటారు* అని అన్నారు. ఇక ఇందులో 16 బిలియ‌న్ డాల‌ర్ల‌ను తాజా ఉత్ప‌త్తుల కోసం, మిగ‌తా 3 బిలియ‌న్ డాల‌ర్ల‌ను పాడి, మాసం కొనుగోలు చేయ‌డానికి ప్రాంతీయ‌, స్థానిక పంపిణీదారుల‌తో భాగ‌స్వావ్యం కావ‌డానికి వినియోగించ‌నున్న‌ట్లు యూఎస్ వ్య‌వ‌సాయ శాఖ వెల్ల‌డించింది.

 

కాగా, అంత‌కుముందు కూడా.. అమెరికా పౌరుల‌ను ఆదుకోవ‌డానికి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ మొత్తంలో ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇది అమెరికా చ‌రిత్ర‌లోనే భారీ ప్యాకేజీగా ప్ర‌క‌టించారు అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు. తాజాగా.. రైతుల కోసం భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. కాగా, అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ 709201కు చేరుకుంది. మరణాల సంఖ్య 37135. ఇప్ప‌టివ‌ర‌కు 59997 మంది కోలుకున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: