క‌రోనా వైర‌స్‌.. అగ్ర‌రాజ్యాలను ఆగ‌మాగం చేస్తోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను నేల‌కేసి కొడుతోంది. ఆయా దేశాల వృద్ధిరేట్‌ను పాతాళానికి తొక్కేస్తోంది. ఇప్ప‌ట్లో కోలుకోలేని దెబ్బ‌తీస్తోంది. ప్ర‌ధానంగా కొవిడ్‌-19కు పుట్టినిల్లు అయిన చైనాకు దిమ్మ‌దిరిగి బొమ్మ క‌నిపిస్తోంది. అనేక ద‌శాబ్దాల త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వుతోంది. ఊహించ‌ని విధంగా డ్రాగ‌న్ కంట్రీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. నిజానికి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ చైనాది. కానీ.. క‌రోనా కార‌ణంగా అత‌లాకుత‌లం అవుతోంది. 2020 మొద‌టి త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ 6.8శాతానికి ప‌డిపోయింది. అనేక దశాబ్దాల త‌ర్వాతం అంటే.. సుమారు 1976 త‌ర్వాత ఇంత‌టి దుర్భ‌ర ప‌రిస్థితిని చైనా ఎదుర్కొంటోంది.  

 

నిజానికి.. 2020 మొదటి త్రైమాసికంలో చైనా స్థూల జాతీయోత్పత్తి 20.65 ట్రిలియన్ యువాన్లు (సుమారు 91 2.91 ట్రిలియన్లు) అంచ‌నా...కానీ.. ఇప్ప‌డది 6.8శాతానికి ప‌డిపోయిన‌ట్లు జాతీయ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గ‌ణాంకాలు చెబుతున్నాయి. 1976లో ముగిసిన సాంస్కృతిక విప్లవం త‌ర్వాత‌ చైనా ఆర్థిక వ్యవస్థ కుదేల‌వ‌డం ఇదే మొదటిసారి అని విశ్లేష‌కులు అంటున్నారు. దీంతో చైనాకు సుమారు 1.44 ట్రిలియ‌న్ యువాన్లు.. అంటే 203.3 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్ట‌మ‌న్న‌మాట‌. ఇది ఏకంగా.. న్యూజిలాండ్ జీడీపీకి స‌మాన‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. క‌రోనా వైర‌స్  క‌ట్ట‌డికి చైనా.. అనేక ప్రాంతాల్లో ష‌ట్‌డౌన్ విధించింది. అనేక రంగాల కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోయాయి. దీంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌మీద తీవ్ర ప్ర‌భావం ప‌డింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: