కొవిడ్ -19 ప్ర‌పంచాన్ని కంటి మీద క‌నుకులేకుండా చేస్తోంది. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు ప్ర‌తి ఇంటినీ భ‌య‌పెడుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. దాదాపు అన్ని దేశాలను ఈ వైరస్‌ గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,54,256 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాల్లో 5,72,076 మంది బాధితులు ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,50,683కు చేరింది.

 

ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా వైర‌స్ దాటికి చివురుటాకులా వ‌ణికిపోతోంది.  అత్యధికంగా యూఎస్‌లో 37,158 మంది కరోనా బారిన పడి చని పోయారు. స్పెయిన్‌లో 20,002, ఇటలీలో 22,745, ఫ్రాన్స్‌లో 18,681, జర్మనీలో 4,352, యూకేలో 14,576, చైనాలో 4,632, ఇరాన్‌లో 4,958, టర్కీలో 1,769, బెల్జియంలో 5,163, బ్రెజిల్‌లో 2,171, కెనడాలో 1,310, నెదర్లాండ్స్‌లో 3,459, స్విట్జర్లాండ్‌లో 1,327 మంది వైర‌స్ బారినప‌డి ప్రాణాలు కోల్పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: