ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయానక వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా దెబ్బకు చనిపోగా..వైరస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దీని తీవ్రత రోజురోజుకు పెరిగిపపోతుంది. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి కేసుల సంఖ్య 240కిపైనే ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రజలు భయపడిపోతున్నారు.. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 126 కేసులు నమోదయ్యాయి.. ఇద్దరు చనిపోయారు. 

 

గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య పట్టణంలో 13 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరు కేసులు ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం.   జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడితో ట్రీట్మెంట్ తీసుకున్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

 

ఇక గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనా సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో ఏపీలో 38 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 6, అనంతపురంలో 5, చిత్తూరులో 5, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో 4, కడపలో ఒక కేసు నమోదైంది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 572కు పెరిగింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: