ఓ వైపు అమెరికాను క‌రోనా అత‌లా కుత‌లం చేస్తోంది. అగ్ర‌రాజ్యం ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితులు క‌నీసం రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో కూడా ఎదుర్కోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అప్‌డేట్‌ను బ‌ట్టి చూస్తే 7 ల‌క్ష‌ల మంది అక్క‌డ క‌రోనా బాధితులు ఉన్నారు. వీరిలో 37 వేల మంది మృతిచెందారు. అమెరికాను కరోనా ఇంత అత‌లాకుత‌లం చేస్తుంటే.. ఓ వైపు ల‌క్ష‌ల మంది బాధితులు ఉండ‌గా.... వేల‌ల్లో ప్ర‌జ‌లు చ‌నిపోతుంటే ఈ టైంలో కొంద‌రు మాస్క్‌లతో బ్రాండ్ యాపారం  చేయ‌డంపట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

ఎన్బీఏ మాస్క్‌ల‌పై లేక‌ర్స్ అని త‌మ బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డం స‌రికాద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎన్‌బీఏ అభిమానులు ఫ్యాబ్రిక్ ఫేస్ మాస్క్‌ల‌ను రెడీ చేసి వీటి అమ్మ‌కాల‌తో వ‌చ్చే ఆదాయాన్ని క‌రోనా ఇబ్బందుల్లో ఉన్న‌వారి ఆక‌లి బాధ‌లు తీర్చ‌డంలో స‌హాయ‌ప‌డ‌నున్నారు. క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ ముక్కు, నోటిని క‌ప్పిం ఉంచుకోవ‌డం ద్వారా ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని కంట్రోల్ చేయ‌వ‌చ్చ‌ని.. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రు స‌హ‌క‌రించాల‌ని... ఎన్బీఏ అధ్యక్షుడు కాథీ బెహ్ర‌న్స్ తెలిపారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాస్క్‌ల‌తో బ్రాండ్ యాపారం చేయ‌డం ఎన్బీఏకే చెల్లింద‌నే చెప్పాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: