కరోనా కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ లు గా ప్రకటించారు. ఇవాళ 8 గంటలవరుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. అయితే ఇప్పటివరకు 14378 పాజిటివ్ కేసులు ఇండియాలో నమోదు కాగా 480 మరణాలు సంభవించాయి. మరియు 1992 కేసులు డీఛార్జి కాగా 11906 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 3323 పాజిటివ్ కేసులు నమోదు కాగా 201 మరణాలు సంభ వించాయి అదేవిధంగా 331 మంది డీఛార్జి అయ్యారు.

 

 

తరువాతి  స్థానం లో ఢిల్లీ 1707 కేసులతో ఉంది .ఢిల్లీలో ఇప్పటి వరకు 42 మరణాలు సంభవించాయి 72 మంది డీఛార్జి అయ్యారు. తరువాతి స్థానంలో చెన్నై 1310 లతో ఉంది ఇప్పటివరకు 15 మరణాలు సంభవించాయి మరియు 283 మంది డీఛార్జి అయ్యారు. దేశంలో అతి తక్కువ కేసులు నమోదు అయినా రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం ఉన్నాయి ఇందులో ఇప్పటివరకు ఒక్కొక్క కేసు నమోదు కావడం విశేషం. ఈ రాష్ట్రాలలో మరణాలు సంభవించలేదు మరియు డీఛార్జి అవ్వలేదు 

మరింత సమాచారం తెలుసుకోండి: