ఓవైపు అమెరికాలో క‌రోనా వైర‌స్‌తో రోజుకు వంద‌లు,  వేల సంఖ్య‌లో జ‌నం ప్రాణాలు కోల్పోతుంటే.. మ‌రోవైపు ఎన్‌బీఏ(నేష‌న‌ల్ బాస్కెట్ బాల్ అసోసియేష‌న్‌) బ్రాండ్ వ్యాపారం మొద‌లు పెట్టేందుకు స‌న్న‌ద్ధం అవుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తీ ఒక్క‌రు త‌ప్ప‌కుండా ఫేస్ మాస్క్‌లు ధ‌రిస్తున్నారు. దీనిని అద‌నుగా తీసుకున్న ఎన్‌బీఏ మాస్క్‌ల వ్యాపారం చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఎన్‌బీఏ పేరుతోనే ఫేస్‌మాస్క్‌లను త‌యారు చేయాల‌ని చూస్తోంది. ప్ర‌తిష్టాత్మ‌క ఎన్‌బీఏకు టీమ్‌ల‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులంద‌రూ ఎన్‌బీఏ మాస్క్‌ల‌ను కొంటార‌ని.

 

దీంతో ఎన్‌బీయే పేరుతో బ్రాండ్‌కు క్రియేట్ చేయ‌వ‌చ్చున‌ని భావిస్తోంది. యూఎస్ఏ, కెన‌డాలో ఈ మాస్క్‌ల‌ను అమ్ముకుని సొమ్ము చేసుకోవ‌చ్చున‌న్న‌ది ఎన్‌బీఏ ప్లాన్‌. వీటిని ఫ‌నాటిక్స్‌తో క‌లిసి మాస్క్‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని, ఇవి ఎన్‌బీఏస్టోర్‌.కామ్‌, డ‌బ్ల్యూఎన్‌బీఏస్టోర్‌.కామ్‌లో ల‌భిస్తాయ‌ని లీగ్ ప్ర‌తినిధులు చెబుతున్నారు. అంతేగాకుండా.. వీటి అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే డ‌బ్బులను కొవిడ్‌-19 పోరుకు, బాధితుల‌కు ఉప‌యోగించవ‌చ్చున‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో లీగ్ అభిమానులంద‌రూ మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో అంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేసిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: