కోవిడ్ - 19పై ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన  సమీక్షా సమావేశం జరిగింది. దీనికి పలువురు కేంద్ర మంత్రులు హా జరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం కోసం ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రసారశాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు హాజరయ్యారు.  ఈ మంత్రుల బృందం  కోవిడ్ - 19, లాక్‌డౌన్‌పై సమావేశమై చర్చించడం ఇది ఐదోసారి.

లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు ప్రజలకు మరింత అందుబాటులోకి ఎలా తేవాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటు ఆయా రాష్ట్రాలకు పలువురు కేంద్ర మంత్రులు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వారి వద్ద నుంచి రాజ్‌నాథ్ సింగ్ సమాచారం  తీసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రతిపాదనలను తాము ప్రధాని మోదీ ముందు ఉంచుతామని మంత్రుల బృందం పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: