తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 66 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 766కు చేరుకుంది. అయితే.. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌రకు కేసుల సంఖ్య‌ 417కు చేరుకుంది. ఇక రాష్ట్రం మొత్తం మీద 186 మంది డిశ్చార్జ్ కాగా, అందులో 131 మంది హైదరాబాద్ వాసులే ఉండ‌డం గ‌మ‌నార్హం రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 13 జిల్లాలో 209 క్లస్టర్లలో 109975 గృహాల్లో 439900 మందిని వైద్య సిబ్బంది సర్వే చేశార‌ని ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

జోగులాంబ గద్వాల జిల్లాలో మరో రెండు కరోనా కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో మరో 15 కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ లైబ్రరీలో రెగ్యులర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతుండడంతో గాంధీ వైద్యలను సంప్రదించాడు. అయితే వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన వైద్యులు.. కరోనా లక్షణాలుగా అనుమానించి ఐసోలేషన్ వార్డుకు త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: