ప్రపంచంలో ఉగ్రరూపంగా మారుతున్న కరోనా వైరస్ ని అరికట్టేందుకు అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.  అయితే దీనికి సరైన యాంటీ డోస్ లభించకపోవడం తో మరణాలు, బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి.  అయితే కరోనా వ్యాప్తిని అరికట్టెందుకు కొన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు భారత్ ఎన్నో రకాల చర్యలు పాటిస్తుంది.. దాంతో భారత్ పై ఇతర దేశాలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.  భాతర ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో అప్రమత్తతో కరోనాని కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. ప్రజల ముందుకు వచ్చి మనో ధైర్యాన్ని నింపుతున్నారు. 

 

తాజాగా యూరప్ ఖండంలో కరోనా మహమ్మారి బారిన పడిన దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఒకటి. ఇప్పటివరకు అక్కడ 26,929 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,327 మంది మరణించారు. అద్భుతమనదగ్గ రీతిలో 16,400 మంది కోలుకున్నారు.  తాజాగా కరోనాపై పోరాటం చేస్తున్న దేశాలకు  స్విట్జర్లాండ్  తన వంతు సంఘీభావాన్ని ప్రకటించింది. సుప్రసిద్ధ ఆల్ప్స్ పర్వతశ్రేణిలోని మాటెర్ హార్న్ పర్వతంపై ఆయా దేశాల జాతీయ పతాకాలను ప్రత్యేకమైన లైటింగ్ సాయంతో ప్రదర్శిస్తోంది. 

స్విస్ ప్రభుత్వం 4,478 మీటర్ల ఎత్తున్న సమున్నత మాటెర్ హార్న్ పర్వతంపై రాత్రి నుంచి సూర్యోదయం వరకు ఆయా దేశాల జాతీయ పతాకాలు, స్ఫూర్తిదాయక వచనాలను ప్రదర్శిస్తోంది. కాగా, భారత త్రివర్ణ పతాకాన్ని కూడా ఆకర్షణీయమైన రీతిలో ప్రదర్శించగా, జెనీవాలోని భారత విదేశాంగ సర్వీసు అధికారిణి గుర్లీన్ కౌర్ దానికి సంబంధించిన వీడియో పంచుకున్నారు. ఈ సందర్భంగా గుర్లీన్ కౌర్ 'హిమాలయాలు, ఆల్ప్స్ మధ్య స్నేహం' అంటూ వ్యాఖ్యానించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: