కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రముఖులు, సెల‌బ్రిటీలు ఎంతో మంది ముందుకు వ‌చ్చి త‌మ వంతుగా భారీ విరాళాలు ఇస్తున్నారు. ఏ రంగంలో ఉన్న‌వారు అయినా కూడా ఈ విష‌యంలో వెనుకాడ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లు భారీ విరాళం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. ఈ రెండు సంస్థ‌లు క‌లిసి క‌రోనాపై ముందుండి పోరాటం చేస్తోన్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ కోసం రైతులు, చిన్న వ్యాపారుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అందించేందుకు ఈ విరాళం అందేస్తున్న‌ట్టు పేర్కొన్నాయి.

 

మొత్తంగా రూ.46 కోట్లు విరాళంగా అందిస్తామని ప్రకటించాయి. రూ.38.3 కోట్లతో ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు, మెడికల్‌ గౌన్లను ఎన్‌జీవోల ద్వారా అందిస్తామని వెల్లడించాయి. కరోనా వల్ల సంక్షభం ఎదుర్కొంటున్న బలహీన వర్గాలకు మరో రూ.7.7 కోట్లు ఇవ్వనున్నామని తెలిపాయి. ఇదే స్ఫూర్తితో మ‌రిన్ని మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలు ముందుకు వ‌స్తే బాగుంటుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: