క్రిస్‌గేల్‌.. ప్రపంచంలోనే విధ్వంస‌క‌ర‌మైన బ్యాట్స్‌మెన్‌.. గేల్ క్రీజ్‌లో ఉంటే చాలు అభిమానుల‌కు పండుగే.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌కు గుండెద‌డే..! ఉన్నంతసేపూ ఎడాపెడా కొట్టుడే కొట్టుడు. ఫోర్లు, సిక్స్‌ల‌తో స్కోర్‌బోర్డు జెట్‌స్పీడ్‌తో ప‌రుగులు పెడుతుంది. చూస్తుండ‌గానే హాఫ్ సెంచ‌రీ, సెంచ‌రీ అభిమానుల క‌ళ్ల‌లో జిగేల్‌మంటాయి! అందుకే గేల్ అంటే.. దేశాల‌తో సంబంధం లేకుండా అభిమానులు ప‌డిచ‌స్తారు.. ఆయ‌న ఆట చూసేందుకు స్టేడియాల‌కు ఎగ‌బ‌డుతారు.. నీ జ‌ట్టు.. నా జ‌ట్టు అన్న తేడాలేకుండా క‌లిసి ఎంజాయ్ చేస్తారు. అందుకే గేల్ అంటే.. సుడిగేలే..! ఆయ‌న‌ను ఎవ‌రితోనూ పోల్చ‌లేం.. ఆయ‌న ఆట‌తీరుకు ఎవ‌రూ స‌రితూగ‌రు..!

 

అందుకే అంటారు క్రికెట్ నిపుణులు.. గేల్‌.. స‌రిలేరు నీకెవ్వ‌రు.. అని! ఈరోజు అంటే ఏప్రిల్ 18(2017)న గేల్‌కు అద్భుత‌మైన రోజు. క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు. అభిమానులు మ‌రువ‌లేని పండుగ రోజు. ఈ రోజుతో గేల్ టీ-20ల్లో 10వేల ప‌రుగులు సాధించిన మొట్ట‌మొద‌టి బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రోజు. అందుకే ఈ రోజు ప్రప‌చం క్రికెట్ చ‌రిత్ర‌లో అద్భుత‌మ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం గేల్ 396 టీ-20 ఇన్నింగ్స్‌ల‌లో మొత్తం 13,296 ప‌రుగులు సాధించి ప్ర‌పంచ క్రికెట్‌పై తిరుగులేని ఆధిప‌త్యాన్ని సాధించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: