ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనాకు విరుగుడు క‌నిపెట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు సానుకూల దిశ‌గా క‌దులుతున్నాయి. ఈ మహ‌మ్మారిని త‌రిమికొట్టే రోజులు దగ్గ‌ర‌లోనే ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రోజుకు వంద‌లు, వేలు సంఖ్య‌లో ప్ర‌జల ప్రాణాల‌ను బ‌లిగొంటున్న వైర‌స్‌ను అంతం చేసే మందు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని అనేక దేశాలు క‌రోనాకు మందును క‌నిపెట్టే ప‌నిలో నిమ‌గ్నం అయ్యాయి. అందులో అమెరికా ముందంజ‌లో ఉంది. అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ వ్యాక్సిన్‌ను క‌నిపెట్టింది. దీన్ని ఇప్ప‌టికే చికాగోలోని క‌రోనా రోగుల‌పై దీన్ని ప్ర‌యోగించడం గ‌మ‌నార్హం. మొత్తం 113 మంది రోగుల‌కు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌గా వారంతా వారం రోజుల్లో కోలుకున్న‌ట్లు అమెరికాలోని గిలియెడ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ వెల్ల‌డించింది.

 

అయితే ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఇంకా అధ్య‌యనం చేయాల్సి ఉంద‌ని పేర్కొంది.  మే మొద‌టి వారంక‌ల్లా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని కంపెనీ తెలిపింది. ఈ వార్త విన్న అమెరిక‌న్ల‌తోపాటు ప్ర‌పంచ ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. చైనా కూడా ఇప్ప‌టికే మొద‌టి ద‌శ వ్యాక్సిన ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని రెండో ద‌శ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను కూడా చేప‌డుతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: