భార‌త్‌లో మ‌హారాష్ట్ర‌లోనే అత్య‌ధిక క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. అందులోనూ దేశ వాణిజ్య‌రాజ‌ధాని ముంబైలో ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారుతోంది. రోజురోజుకూ ఇక్క‌డ కొవిడ్-19 కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క‌రోజే ఏకంగా 328 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య ఏకంగా 3648కు చేరుకుంది. ఇందులో ముంబై న‌గ‌రంలోనే సుమారు 2500కేసుల‌కుపైగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 201మంది మ‌ర‌ణించారు.

 

తాజాగా.. ఈరోజు ముంబైలో భార‌త నేవీకి చెందిన 26మంది సిబ్బందికూడా క‌రోనా వైర‌స్‌బారిన‌ప‌డ్డారు. రోజురోజుకూ వైర‌స్ బారిన ప‌డుతున్న వైద్యులు, పోలీస్ సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతోంది. జాతీయ స‌గ‌టు మ‌ర‌ణాల రేట్ 3.2గా ఉంటే.. మ‌హారాష్ట్ర స‌గ‌టు మ‌ర‌ణాల రేట్ రెట్టింపుగా అంటే 6.05గా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: