యూర‌ప్‌లో క‌రోనా వైర‌స్ మ‌ర‌ణ మృదంగం కొన‌సాగుతోంది. రోజుకు వంద‌లు, వేల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 100,501మంది క‌రోనా బారిన‌ప‌డి మ‌ర‌ణించారు. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,136,672కు చేరుకుంద‌ని అధికారిక లెక్క‌లే చెబుతున్నాయి. కొవిడ్ మహమ్మారి కార‌ణంగా అతిదారుణంగా దెబ్బ‌తిన్న ఖండం యూర‌ప్‌. ఇందులో ప్ర‌ధానంగా స్పెయిన్‌, ఇట‌లీ, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, యూకే త‌దిత‌ర దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో ఒక్క‌రోజులోనే ఏకంగా 642 కరోనావైరస్ మరణాలు సంభ‌వించాయి. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 19,323కు చేరుకున్న‌ట్లు ఆదేశ ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్ల‌డించింది.

 

స్పెయిన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 191726 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 20,043మంది మ‌ర‌ణించారు. ఇట‌లీలో 172434 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 22,745 మంది మ‌ర‌ణించారు. యూకేలో 108692 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 14,576 మంది మ‌ర‌ణించారు. జ‌ర్మ‌నీలో 141968 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,377 మంది మ‌ర‌ణించారు. ఇంత‌టి దారుణ‌మైన ప‌రిస్థితుల‌తో యూర‌ప్ ఖండం దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: